బీహార్‌కు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖకు చెందిన సుమారు 25 మంది సభ్యులు మంత్రి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి.తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
