తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో పాటు తదితరులు ఉన్నారు.
సచివాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇంటీరియర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి.సచివాలయానికి వచ్చే కంటే ముందు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో తెలంగాణలో రోడ్ల పరిస్థితిపై కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ప్రజారోగ్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం చర్చించారు. ఆ తర్వాత కొత్త సచివాలయం ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుని పనులను పరిశీలిస్తున్నారు.