ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్‌షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతానని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.నేను తిరిగి అసెంబ్లీకి వెళ్లాలన్నా, నేను రాజకీయాల్లో ఉండాలన్నా, ఏపీకి న్యాయం జరగాలన్నా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని, లేదంటే అదే తనకు చివరి ఎన్నిక కానున్నట్లు చంద్రబాబు తెలిపారు. మీరు నన్ను దీవిస్తారా, నన్ను నమ్ముతున్నారు కదా అని బాబు రోడ్‌షోలో అన్నారు.