రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు అన్ని కూడా వ్యవసాయ మార్కెట్లో అమ్ముకోవలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎక్కడ కూడ దళారుల బెడద లేకుండా తూకం లో కూడా తేడ లేకుండా మీరూ అత్యధిక ధరలను మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ లాభాలు పొందవచ్చు అని అన్నారు..మార్కెట్లో రైతులకు అన్ని రకాలుగా సకల సౌకర్యాలు కలిపిస్తున్నట్లు వారు అన్నారు..రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మార్కెట్లో ఈనామ్ పద్దతి ద్వారా బయట ఉండే రేటు కన్న 4నుండి 5 వందల రూపాయల దర ఎక్కువ పొందే అవకాశం ఇక్కడ ఉంది కావున ఇక్కడికి వచ్చి మాత్రమే పత్తిని అమ్ముకోవలని సూచించారు.
ఈనామ్ ద్వారా ట్రేడర్స్ మధ్య పోటీ తత్వం పెరిగి రైతులకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు..అదేవిధంగా అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్నట్లు వారు తెలిపారు.. రానున్న నాలుగయిదు రోజుల్లో మార్కెట్లో 5 రూపాయలకె సద్ధిమూట కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు అన్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని వారి మార్గదర్శకత్వంలో కొనుగోలు కేంద్రాలు సాఫీగా సాగుతున్నాయని వారు స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టిన సహకారాన్ని అందివ్వకున్న రైతల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు..రైతుల కండ్లల్లో సంతోషం, వారి సంక్షేమం ద్వేయంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని తెలిపారు..ఈ సందర్భంగా వారి వెంట మార్కెట్ సెక్రెటరీ జాన్వెస్లీ, సుపర్వైజర్ మహిపాల్, మరియు మార్కెట్ సిబ్బంది , రైతులు, తదితరులు ఉన్నారు..