తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజులు, గంటల తరబడి వేచియుంటేనే స్వామివారి దర్శనం కలుగుతుంది. ప్రసుత్తం స్వామివారి దర్శనం లభించాలంటే 30 గంటల (రెండున్నర రోజుల) సమయం తీసుకుంటుండగా ఓ కానిస్టేబుల్ నిర్వాకం చేతివాటం కారణంగా భక్తులను దొడ్డిదారిన పంపించడం పట్ల టీటీడీ తీవ్రంగా పరిగణించింది.
శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేకుండా భక్తులకు అనుమతిస్తున్న కానిస్టేబుల్ నిర్వాకాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు కానిస్టేబుల్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. భక్తుల వద్ద ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ అధిక మొత్తంలో నగదు తీసుకున్నట్లు గుర్తించారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా అతన్నిపట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.