గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆమ్ ఆద్మీ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆ పార్టీ తెలిపింది. కంచన్ జరీవాలాను ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ కిడ్నాప్ చేసినట్లు ఆప్ నేత మనీశ్ సిసోడియా ఈ సందర్భంగా ఆరోపించారు.
వచ్చె నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. నిన్నటి నుంచి కంచన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు మిస్సింగ్‌లో ఉన్నారన్నారు. నామినేషన్ పేపర్లు దాఖలు చేసేందుకు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కంచన్‌ను బీజేపీ గుండాలు ఎత్తుకెళ్లినట్లు డిప్యూటీ సీఎం సిసోడియా ఆరోపించారు.
Our candidate from Surat (East), Kanchan Jariwala, and his family missing since yesterday. First, BJP tried to get his nomination rejected. But his nomination was accepted. Later, he was being pressurised to withdraw his nomination.
Has he been kidnapped?
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2022