బీహార్ మోతిహరిలో వింత ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్లిన ఓ మహిళ ముక్కు లేని బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్గా మారగా.. కొందరు గణనాథుడు పుట్టాడని అంటుండగా.. మరి కొందరు గ్రహాంతర వాసి పుట్టాడని అంటున్నారు. ఇంతకీ వైద్యులు ఏం చెప్పారంటే..
అలీషెర్పుర్కు చెందిన సరోజ పటేల్, రూపాదేవి భార్యాభర్తలు. రూపాదేవి ఇటీవల డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్లింది. రూపాదేవికి ఓ బిడ్డ పుట్టగా.. ఆ బిడ్డకు ముక్కు లేదు. అయితే ముక్కు స్థానంలో ఓ వింత ఆకారంలో రెండు కళ్లు ఉన్నాయి. ఆ శిశువు శ్వాస తీసుకోవడానికి రంధ్రం కూడా లేదు. దీంతో వైద్యులు బిడ్డ నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి వైద్యం చేస్తున్నారు. కాగా తల్లిదండ్రుల్లో జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా పుడతారని వైద్యులు స్పష్టం చేశారు.