కోదాడ మున్సిపాలిటీని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.సోమవారం కోదాడ పట్టణంలోని 21వ వార్డులో రూ.80లక్షలతో, 28వ వార్డులో రూ.54లక్షల వ్యయంతో రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, 7వ వార్డుల బాలాజీ నగర్ లోని కోటి 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామమును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కోదాడలోని అండర్ డ్రైనేజీ పనులు నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. అత్యాధునిక వసతులతో బాలాజీ నగర్ లో కోటి 44 లక్షల రూపాయలతో అద్భుతమైన వైకుంఠధామని నిర్మించామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అని ఆయన కోరారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. కోదాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం జరుగుతుంది అని ఆయన అన్నారు.పట్టణంలో అహ్లాదాన్ని పంచే మినీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు కోదాడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.పట్టణాన్ని మరింత సుందర పట్టణంగా తీర్చిదిద్దుకుని భావితరాలకు అద్భుతమైన పట్టణాన్ని అందించడం సాధ్యమవుతుందన్నారు.
గజ్వేల్ లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు అని తెలిపారు.పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, అమ్మఒడి, కేసీఆర్ కిట్, దళిత బంధు, వంటి మరెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. అనంతరం ఆయా వార్డులకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,పట్టణ కౌన్సిలర్లు కట్టేబోయిన జ్యోతి శ్రీనివాస్, కందుల చంద్రశేఖర్, కోట మధుసూదన్, కైలా స్వామి,అపర్ణ వెంకట్, ఫాతిమా కాజా, వంటిపులి రమా శ్రీనివాస్, మైస రమేష్ , చందర్ రావు, మేదర లలిత, బెజవాడ శిరీష శ్రవణ్, డాక్టర్ బ్రహ్మం, సాదిక్, సొసైటీ చైర్మన్ ఆవుల రామారావు, ,పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,టిఆర్ఎస్ నాయకులు దేవమణి ప్రకాష్ బాబు, రాయపూడి వెంకటనారాయణ, సైదా నాయక్ ,గంధం పాండు, పందిరి సత్య నారాయణ,బత్తుల ఉపేందర్, గంధం రాము, వంశీ,మున్సిపల్ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.