టాలీవుడ్, బాలీవుడ్ 80 నాటి అగ్ర నటులు ఒకే చోట కనువిందు చేశారు. ఇండ్రస్ట్రీలో హీరో హీరోయిన్లు, సహా నటుల మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది. అందరికీ చాలా మంది అభిమానులు ఉంటారు. ఒకరు ఇద్దరు స్టార్లను ఒక్క చోట చూస్తేనే అభిమానులు రెండు కళ్లు చాలవు. అలాంటిది అలనాటి స్టార్లు అంతా ఒక్కచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. అభిమానులకు అయితే కన్నుల పండుగే. తాజాగా 80 నాటి హీరో, హీరోయిన్లు అంతా ఒక్క చోట కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ వీరంతా ఎందుకు, ఎక్కడ కలిశారో తెలుసా..
ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పేరుతో గత కొన్నేళ్లుగా అలనాటి నటులు ప్రతి సంవత్సరం ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ ఈవెంట్‌కు జాకీ ష్రాఫ్, పూనమ్ ధిల్లాన్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ వేడుకలో తెలుగు నటులతో పాటు ఇతర భాషల నటులు కూడా హాజరయ్యారు. ఆట పాటలతో సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, రమ్యకృష్ణ, నరేశ్, అర్జున్, రేవతి, భానుచందర్, సుమలత, నదియా, సుహాసిని, రాధ, జయప్రద, శోభన, విద్యాబాలన్, ఖుష్బూ, రాజ్ బబ్బర్, అనుపమ్ ఖేర్, శరత్ కుమార్, అనీల్ కపూర్, టీనా అంబానీ, మీనాక్షి శేషాద్రి తదితరులు హాజరయ్యారు.