ఏ ఆర్భాటం లేకుండా కేవలం ఓ కన్నడ మూవీగా రిలీజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార సినిమా. ఒక్క భాషలోనే రిలీజ్ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకోవడంతో చకచకా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం రెండు మూడు సార్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఉన్నారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సినీప్రియులు కాంతార ఎప్పుడడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. మరి కాంతార ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది.. ఎందుకు ఇంత ఆలస్యం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్నడ థియేటర్లలో సెప్టెంబరు 30న రిలీజైంది కాంతార. అతి తక్కువ కాలంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను వెనక్కి నెట్టేసింది. దీంతో ఈ మూవీని వెంటనే తెలుగు, హిందీ, మలయాళం, తమిళంలో చకచకా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఏ మూవీ అయినా వారం, 10 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ కాంతార ఇప్పటికీ కోన్ని థియేటర్లలో ఆడుతుండడంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి టీమ్ ఇంట్రస్ట్ చూపడం లేదు.
అయితే కాంతార సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ముందుగా నవంబరు 4న ఈమూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ అది కుదరకపోవడంతో నవంబరు 18న ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి కాంతార నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..