దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా దేవునిగుడెం లో 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆకొండపెట్ లో చెరువు మత్తడి మరమ్మత్తు పనులను ప్రారంభించి మున్యల్ లో మనా ఊరు మన బడి పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
దశాబ్దాల నిరీక్షణ రాంపూర్ బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. దస్తురబాధ్ ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కెసిఆర్ గారి సారథ్యంలో పల్లెలను, పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు కెసిఆర్ గారు పాటు పడుతున్నారు అని అది కేవలం సీఎం కెసిఆర్ తెరాసా పార్టీ వల్లే అవుతుంది అని అన్నారు.
దస్తురబాధ్ ను నూతన మండలం గా ఏర్పాటు చేసుకొని మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాం అని అన్నారు.అనంతరం అక్కడే 8 దండారి చెక్కుల మరియు 2 లక్షల రపాయల విలువగల సీఎం సహయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో దస్తురబాద్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.