తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఈడీ, ఐటీ సంయుక్త సోదాలను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో 20కి పైగా బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మంత్రి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు.
ఆదాయపన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెర్టరేట్(ఈడీ) ఏకకాలంలోనే ఈ సోదాలు జరుపుతున్నారు. కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో, మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లలో సోదాలు నిర్వహిస్తున్నారు. గంగుల ఇంటి తాళాలు పగల గొట్టి అధికారులు లోపలకి వెళ్లారు. ఇక హైదరాబాద్‌లోని సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు జరిపారు. పంజాగుట్టలోని పీఎస్‌ఆర్ గ్రానైట్స్, హైదర్‌రూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేశారు.