జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి నటుడు జీవి మాట్లాడుతూ”పవన్ అన్న.. మీ చుట్టూ ఎవరు ఉన్నారో చూసుకోండి. టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చిరంజీవిని ఎలా తిట్టారో గుర్తుందా? చింతమనేని ఏమన్నాడో మర్చిపోయారా? మేం మర్చిపోలేదు.
కాపుల తరఫున మీరు ముఖ్యమంత్రి కావాలని మేం కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు మిమ్మల్ని కలిసినప్పుడు మేం చచ్చిపోయాం’ అని ఆయన ఓ సభలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.