మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లలో సగం కంటే ఎక్కువ 482 ఓట్లు నోటా రావడం గమనార్హం.
ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదటి రౌండ్ నుంచి రెండు డిజిట్ల సంఖ్యల ఓట్లనే దక్కించుకున్నారు పాల్. ఇక వీటిలో అత్యధికంగా 13వ రౌండ్‌లో 86 ఓట్లు సాధించగా.. అత్యల్పంగా 15వ రౌండ్‌లో 11 ఓట్లు మాత్రమే సొంతం చేసుకున్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని.. ఈవీఎంల ట్యాపింగ్ వల్లే ఇదంతా జరిగిందని, ఇదంతా ఫ్రాడ్ అని కామెంట్స్ చేశారు.