మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్‌పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయకుల డ్రామాకు సంబంధించిన వీడియోను తన ట్వీట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయకుడు ఒకరు హంగామా సృష్టించారు. వేరే వ్యక్తికి ఫోన్‌ను విసిరేసి, పోలింగ్ కేంద్రంలోకి పరుగెత్తాడని పేర్కొన్నారు.
ఓటర్ల ముందు నేలపై పడుకొని, పోలీసులు నన్ను కొట్టారని దొంగ ఏడుపు ఏడ్చేశాడని తెలిపారు. మోదీ యాక్టింగ్ స్కూల్ అని క్రిశాంక్ చివరగా రాశారు. ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. కమల్ హాసన్ గర్వపడేలా నటించాడు అని పేర్కొన్నారు.
? Kamal Hasan would be proud https://t.co/AoOKtSGW40
— KTR (@KTRTRS) November 4, 2022