ట్విట్టర్లో ఎలాన్ మస్క్ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.
