మధ్యప్రదేశ్లో శుక్రవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తోన్న కారు (ఎస్యూవీ) ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా ఝల్లార్ వద్ద జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న వారంతా చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, 3 మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతులంతా మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్మట్టలో పనిచేస్తోన్న కూలీలు. ఈ ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సు ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి ఖాళీగా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.