బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌లానీ మెకనీ. 2000 మిస్ వరల్డ్ పోటీల్లో ఫేవరెటిజం చూపించారని.. అందుకే ప్రియాంక చోప్రాకు కిరీటం దక్కిందని.. అసలు ఆమె అందంగా ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది లెయ్‌లానీ మెకనీ. ఆ ఏడాది జరిగిన ప్రపంచ సుందరి పోటీల తీరు వివరిస్తూ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది మాజీ మిస్ బార్బడోస్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
2000లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ప్రియాంక చోప్రాతో పాటు లెయ్‌లానీ మెకనీ కూడా పాల్గొందట. 1999, 2000 ఈ రెండు సంవత్సరాల్లోనూ భారత్‌కే మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. అయితే ఈ రెండు కిరీటాల వెనుకు స్పాన్సర్లు కారణం అని ఘాటు వ్యాఖ్యలు చేసింది లెయ్‌లానీ మెకనీ. ఇక ప్రియాంక విషయానికి వస్తే అసలు ఆమె అందగత్తే కాదని, అందరిలా ఆమె ఎప్పుడూ రిహార్సల్స్‌లోనూ పాల్గొనలేదని చెప్పింది. అందరూ మధ్యాహ్నం భోజనం ఒకదగ్గర చేస్తే ప్రియాంక చోప్రాకు మాత్రం ప్రత్యేకంగా తన గదికి తీసుకెళ్లి భోజనం ఇచ్చే వారని చెప్పింది. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా డ్రెస్సులు డిజైన్ చేశారని, ఆమెకు స్పెషల్‌గా ఫోటోలు తీసి పేపర్లలో వేయించారని వీడియోలో చెప్పింది.