హైదరాబాద్‌లోని వసస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. కారులో తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా భార్య, పోలీసులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వనస్థలీపురంలో స్పెషల్ బ్రాంచ్ సీఐగా విధులు నిర్వర్తిస్తోన్న రాజు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సీఐ ఆ మహిళతో కారులో ఏకాంతంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న భార్య అక్కడికి వెళ్లి ఆయనతో గొడవ పెట్టుకుంది. గమనించిన పోలీసులు విషయం తెలుసుకుని ఆయన్ను ప్రశ్నించగా మద్యం మత్తులో ఉన్న రాజు తాను సీఐ అని పోలీసులపై దాడి చేశాడు. దీంతో పోలీసులు సీఐ రాజు, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీఐ రాజు భార్య, పిల్లలు తమకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.