తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు గురువారం నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికల పోలింగ్ మార్నింగ్ ఏడు గంటల నుండి మొదలైంది.
ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నరు. మార్నింగ్ నుండి పోలింగ్ ప్రశాంతంగా జరిగిన కానీ మునుగోడు నియోజకవర్గంలోని చండూరు పట్టణ కేంద్రంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
బీజేపీ టీఅర్ఎస్ కు చెందిన స్థానికేతరులను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాము.పోలీసులు వాళ్లను వదిలేశారని బీజేపీ నేతలు,కార్యకర్తలు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్వల్పమేర లాఠీ చార్జీ చేశారు.