ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల డీఎస్‌పీ ఓ ఆల్బమ్‌లో ఓ పారి అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. అందులో ఓ మంత్రాన్ని తప్పుగా ఉపయోగించారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై కేసు వేశారు.
హరేరామ హరేకృష్ణ అనే మంత్రాన్ని ఓ పారి అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా షూటింగ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. పవిత్రమైన మంత్రాన్ని ఇలా ఐటెం సాంగ్‌లో పొట్టి పొట్టి బట్టలు, అసభ్య డాన్సుల మధ్య చిత్రీకరించడాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల హిందూ మనోభావాలు దెబ్బతీసినట్లే అని ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ పాటలోని ఆ మంత్రాన్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై కేసు పెట్టారు.
దేవీ శ్రీ ప్రసాద్ సొంత మ్యూజిక్ డైరెక్షన్‌లో రిలీజైన ప్రైవేట్ సాంగ్ ఇది. పాన్ ఇండియా రేంజ్ అయిన ఈ సాంగ్ దేశంలోనే పలు భాషల్లో గత నెల అక్టోబరులో విడుదలైంది. తెలుగులో ఓ పిల్లా పేరుతో వచ్చిన ఈ పాటను బిగ్‌బాస్ 6 వేదికగా ఈ సాంగ్‌ను నాగార్జున రిలీజ్ చేశారు.