Home / LIFE STYLE / మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా యువ‌త‌లో స్ట్రోక్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ద‌ని, యువ‌త‌లో స్ట్రోక్ కార‌ణంగా మ‌ర‌ణాలు, తీవ్ర వైక‌ల్యం ఏర్ప‌డుతున్న‌ద‌ని అధ్య‌య‌న ర‌చ‌యిత, ద‌క్షిణ కొరియాకు చెందిన సియోల్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ యూ కిన్ చో తెలిపారు.

ఈ క్రమంలో ఈ రోజుల్లో  ఓ మోస్త‌రు నుంచి అధికంగా మ‌ద్యం సేవించే 20, 30 ఏండ్ల వ‌య‌సు యువ‌త అస‌లు మ‌ద్యం ముట్ట‌నివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే అధికంగా స్ట్రోక్ బారినప‌డతార‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రించారు. అతిగా, మ‌ధ్య‌స్ధంగా ఏండ్ల త‌ర‌బ‌డి మ‌ద్యం తీసుకునే వారిలో స్ట్రోక్ ముప్పు అధిక‌మ‌ని జ‌ర్న‌ల్ న్యూరాల‌జీలో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది.మ‌ద్యం వినియోగం త‌గ్గించ‌డం ద్వారా యువ‌త‌లో స్ట్రోక్‌ను మ‌నం నివారిస్తే అది మాన‌వాళి ఆరోగ్యం, స‌మాజంపై స్ట్రోక్ భారాన్ని త‌గ్గిస్తుంద‌ని  పేర్కొన్నారు.

వారానికి 105 గ్రాములు అంత‌కుమించి మ‌ద్యం సేవించేవారిని అతిగా మ‌ద్యం సేవించే వారుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఇది రోజుకు 15 ఔన్సుల‌తో స‌మానం కాగా రోజుకు ఒక డ్రింక్ కంటే అధికం. అధ్య‌య‌నంలో భాగంగా 15 ల‌క్ష‌ల మందికి పైగా పరీక్షించ‌గా, అధ్య‌య‌న కాలంలో 3153 మంది స్ట్రోక్‌కు గురయ్యారు. అధ్య‌య‌న కాలంలో రెండేండ్లు అంత‌కు పైబ‌డి అతిగా మ‌ద్యం సేవించిన వారిలో మ‌ద్యం సేవించ‌నివారు, ఓ మోస్త‌రుగా మ‌ద్యం సేవించే వారితో పోలిస్తే స్ట్రోక్ ముప్పు 20 శాతం అధికంగా ఉంద‌ని వెల్ల‌డైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat