క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన కొడుకు అర్జున్ తెందూల్కర్‌తో కలిసి బెళగాం- గోవా జాతీయ రహదారిపై వెళ్తూ మధ్యలో ఓ టీ షాపు దగ్గర కారు ఆపి టీ తాగారు. అంతేకాకుండా ఆ ఛాయ్‌వాలాతో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
లాంగ్ జర్నీ చేసినప్పుడు ఉదయం స్నాక్స్‌తో పాటు వేడి వేడి ఛాయ్ ఉంటే ఆ మజానే వేరు అంటూ సచిన్ వీడియోలో అన్నారు. ఆయన టీలో రస్క్ తింటూ ఛాయ్ చాలా బాగుందని తన కొడుకు అర్జున్‌కు చెప్తూ తనని టీ తాగడానికి పిలిచారు. అనంతరం టీ షాపు యువకుడితో మాట్లాడి వారితో సచిన్ స్వయంగా సెల్ఫీ తీసుకున్నారు. సచిన్‌ను పలకరించిన ఓ విద్యార్థినితోనూ మాట్లాడారు. అనుకోకుండా తమ షాపు దగ్గరకు వచ్చిన సచిన్ చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురై సంబరపడిపోయారు. మరోవైపు ఈ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన గంటల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.