ప్రముఖ సీనియర్ స్టార్ హీరో.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేరస్తుల ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతనికి ఎక్స్ కేటగిరీ భద్రత అందిస్తున్నారు. సల్మాన్‌తో పాటు హీరో అక్షయ్ కుమార్, నటుడు అనుపమ్ ఖేర్‌లకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు.
ఈ అదనపు భద్రత ఖర్చును తారలే భరించాల్సి ఉంటుంది. పంజాబ్‌కు చెందిన గాయకుడు సిద్ధు మూసేవాలకు పట్టిన గతే మీకు పడుతుందని ఇటీవల సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ నివాసం వద్ద ఓ లేఖ లభించింది. దర్యాప్తు చేసిన పోలీసులు సల్మాన్ కుటుంబానికి ముప్పు ఉందని నిర్ధారించుకున్నారు. వారు ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం సెక్యూరిటీని పెంచారు.