ప్రముఖ నటి హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్త ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
ముంబయి భామ హన్సిక డిసెంబరులో వివాహా బంధంలోకి అడుగుపెట్టనుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటోలు తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటూ.. ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది. హన్నికకు కాబోయే భర్త మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ హన్నికకు ప్రపోజ్ చేయగా హన్నిక అందుకు అంగీకరించి అతన్ని ప్రేమగా హగ్ చేసుకుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ రాజకోటలో డిసెంబరు 4న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.