తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న మరో డీఏ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెలలో రెండు డీఏలను ప్రకటించిన సంగతి విదితమే.
ఈ డీఏలను ఈ నెల జీతంతో కలిసి 3.9 శాతం డీఏను నేడు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు 63.9 శాతం చెల్లించగా, 2022 సంవత్సరానికి చెందిన రెండు డీఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆందోళనకు దిగిన కార్మికులతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చర్చలు జరిపి హామీ ఇచ్చారు.