మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. మలయాళీ లూసీఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో గాడ్‌ఫాదర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫాంలో గాడ్‌ఫాదర్ సినిమాను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. నవంబరు 19 నుంచి మెగాస్టార్ మూవీ అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు.