తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో వచ్చిన ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా భారీగా ప్రచారం చేస్తున్నాయి..
ఈ ఉపఎన్నిక అత్యంత ఖరీదైనది కానుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే నిత్యం కోట్ల రూపాయలు పోలీసులకు పట్టుబడ్డాయి. ఇక మునుగోడు ఓటర్లకు బీజేపీ 1 గ్రాము బంగారం పంచుతోందంటూ నెటిజన్లు ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.