ప్రముఖ యాక్టర్ రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కారు మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. రంభకు సల్ప గాయాలు కాగా ఆమెతో పాటు ప్రయాణిస్తున్న తన కూతురికి గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తాజాగా ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను రంభ సోషల్ మీడియాలో పంచుకుంది.
రంభ ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం కెనడాలో ఉంటుంది. సోమవారం సాయంత్రం తన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో అందరూ క్షేమంగా ఉన్నారని చిన్న చిన్న గాయాలు అయ్యాయని తెలిపారు. తన చిన్న కూతురు సాషాకు కాస్త ఎక్కువ గాయాలు కాగా ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేశామని చెప్పారు రంభ. ప్రమాదం గురుంచి ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాప తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.