కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చూస్తుంది. ఆ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గ్రామాల్లోని వీధుల్లోకి ర్యాలీగా వెళ్లి.. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని.. భారీ మెజారిటీ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావాలంటే మునుగోడు ఎన్నికల్లో బీజేపీని చిత్తూ చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట స్థానిక ఎంపీటీసీ పొలగాని విజయలక్ష్మి సైదులు గౌడ్ , సింగారం సర్పంచ్ గుర్రాల పరమేష్, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు ఉన్నారు.