నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఖాతాల్లోకి తన కుటుంబానికి చెందిన సుశీఇన్ ఫ్రా కంపెనీ నుండి జరిగిన దాదాపు రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసులను జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం . అయితే ఈ కంపెనీ నుండి ఈ నెల 14,18,29 తారీఖున నగదు బదిలీ చేసినట్లు శనివారం అధికార టీఆర్ఎస్ కు చెందిన నేతలు పక్కా ఆధారాలతో ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు.