Home / SLIDER / ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు

ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు

ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక ఊపుతున్న తాజా సంచలనం  అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి,గువ్వల బాలరాజు,బీరం హర్శ వర్ధన్ రెడ్డిలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం  కొనుగోలు వ్యవహారం. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు.

‘‘ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి.ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులం. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా సీఎం, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడము. తొందర పడవద్దని మా పార్టీ నాయకత్వానికి చెప్పా. సమయానుసారం సీఎం అన్ని విషయాలు మాట్లాడతారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు’’ అని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది సున్నా అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, మోడీ సర్కార్‌పై పలు ఛార్జ్‌ షీట్‌లు దాఖలు చేస్తున్నట్లు చెప్పారు.

* ఫ్లోరోసిస్‌ అరికడదాం అంటే.. బీజేపీ చలించనందుకు ఛార్జ్‌ షీట్‌.
* బీజేపీ భావదారిద్య్రాన్ని ఎండగట్టడానికి జూటా జుమ్లా పార్టీ మీద ఛార్జ్‌ షీట్‌.
* కొత్త నవోదయ పాఠశాల ఇవ్వనందుకు, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయనందుకు ఛార్జ్‌ షీట్‌.
* బీసీల జనగణనను పట్టించుకోని మోడీ సర్కార్‌పై బీసీ సోదరుల పక్షాన ఛార్జ్‌ షీట్‌.
* ఎత్తిపోతల పథకాలను అడ్డుకున్నందుకు కేంద్రంపై ఇంకో ఛార్జ్‌ షీట్‌.
* గిరిజనుల రిజర్వేషన్‌ 10 శాతానికి పెంచుకునే అవకాశం ఇవ్వని కేంద్రంపై ఛార్జ్‌ షీట్‌.
* ఈ ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సింది పోయి.. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నందుకు ఛార్జ్‌ షీట్‌.
* చేనేత రంగంపై జీఎస్టీ విధిస్తున్నందుకు బీజేపీపై ఛార్జ్‌ షీట్‌.
* రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1200 చేసినందుకు బీజేపీపై ఛార్జ్‌ షీట్‌.
* మైనారిటీ, అల్పసంఖ్యాకులపై దాడి చేస్తున్నందుకు కేంద్రంపై ఛార్జ్‌ షీట్‌.
* పేదలకిచ్చే సంక్షేమ కార్యక్రమాలను బద్నాం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై ఛార్జ్‌ షీట్‌.
* రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న కేంద్రంపై ఛార్జ్‌ షీట్‌.
* కర్ణాటకలో గీత కార్మికుల పొట్ట కొట్టి, ఇక్కడికొచ్చి కపట ప్రేమను చూపిస్తున్నందుకు ఛార్జ్‌ షీట్‌.
* విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నందుకు మోదీ సర్కారుపై ఛార్జ్‌ షీట్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat