Home / POLITICS / బండ్లన్న సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరంగా ఉంటా..!

బండ్లన్న సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరంగా ఉంటా..!

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కుటుంబ బాధ్యతలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు.

‘కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు.. పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే. ఇంతకుముందు నావల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

2018 ఎన్నికలకు ముందు బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు పూర్తిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat