ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబం అందరూ కలిసి సరదాగా టీ తాగుదాం అనుకుంటే 5 నిండు ప్రాణాలు పోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్, భార్య ఇద్దరు పిల్లలు శివంగ్, దివ్యాన్ష్, ఆయన తండ్రి రవీంద్ర సింగ్తో కలిసి ఉంటున్నారు. గురువారం వీరింటికి పొరిగింటి వ్యక్తి సోబ్రాన్ రాగా శివానందన్ భార్య వారికోసం టీ చేసింది. చిన్నారులు కూడా సరదాగా టీ తాగారు. అంతే టీ తాగిన వెంటనే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్లగా అప్పటికే తాత, మనవళ్లు మృతి చెందారు. సోబ్రాన్, శివానందన్ల పరిస్థితి విషమించడంతో వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అక్కడ ఇద్దరు చనిపోయారు. శివానందన్ భార్య టీలో టో పొడి అనుకొని వరి పంటకు వేసే మందును పొరపాటున వేసేసింది.