ముంబయిలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ క్యాబ్ బుక్‌చేసింది. క్యాబ్ రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆ మహిళ న్యాయస్థానాన్నిఆశ్రయించింది. సదరు క్యాబ్ సంస్థకు కోర్టు రూ. 20 వేలు జరిమానా విధించింది.
ముంబయికి చెందిన కవితా శర్మ ఓ లాయర్. 2018 జూన్‌లో ఆమె ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాలని ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఆమె ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 36 కిలో మీటర్లు. క్యాబ్ రావాల్సిన టైమ్ కంటే 20 నిమిషాలు లేటుగా వచ్చింది. అది కూడా ఆమె చాలా సార్లు క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేయగా. ఇక లేటుగా వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఆ టైమ్ కవర్ చేసి ఆమెను గమ్యస్థానికి చేరాల్చింది పోయి.. దారిలో చాలా సార్లు క్యాబ్ ఆపేశాడు. పైగా ఫోన్‌లో మాట్లాడుతూ స్లోగా క్యాబ్ పోనిచ్చాడు. దీంతో కవితా శర్మ ఎయిర్‌పోర్టుకు వెళ్లేసరికి విమానం వెళ్లిపోయింది. ఆమె మరో టికెట్ చేసుకొని తర్వాత ఫ్లైట్‌కు చెన్నై వెళ్లారు.
ఈ ఘటనపై ఆమె ఉబర్ సంస్థకు నోటీసులు పంపగా ఆ సంస్థ నుంచి ఎలాంటి రెస్ఫాన్స్ లేదు. అనంతరం ఆమె ఠాణె జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన తీర్పు తాజాగా వచ్చింది. తీర్పులో వినియోగదారునికి కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు, మానసికంగా వేదనకు గురిచేసినందుకు మరో పదివేలు చెల్లించాలని ఆదేశించింది.