ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే అంశాలను ప్రస్తావిస్తాడనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
‘‘అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన ‘వ్యూహం’ కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రెండు పార్ట్‌ల్లోనూ రాజకీయ అరాచకాలు ఉంటాయి. ప్రేక్షకులు తొలి చిత్రం షాక్ నుంచి తేరుకునేలోపే వారికి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్ 2 రూపంలో తగులుతుంది. నేను గతంలో తీసిన ‘వంగవీటి’ సినిమా నిర్మాతే ఈ కొత్త చిత్రాన్నీ నిర్మిస్తున్నారు. రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం. ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్‌పిక్. బయోపిక్‌లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్‌లో అన్నీ నిజాలే ఉంటాయి’’ అని ఆర్జీవీ తన ట్వీట్లలో పేర్కొన్నారు.