Home / SLIDER / మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికతోనే దేశంలో బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రోజు బుధవారం కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయ సంస్థను ఆయన సందర్శించారు.

అక్కడి సదుపాయాలపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.దేశంలో తమ  ఉనికిని చాటుకోవడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తమ పార్టీలో చేర్చుకుని ఉప ఎన్నికలకు కారణం అవుతున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారని ఆయన  వెల్లడించారు.

మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఘోరంగా ఓడించేందుకు ఓటర్లు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నలతో అక్కడి ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat