దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకుని తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ప్రముఖ వర్థమాన నటి పూర్ణ. సోమవారం దుబాయ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న ఖాసిమ్, షనీద్ అసిఫ్ ఆలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న పూర్ణ.. తన భర్తను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు.తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు నటి పూర్ణ.