ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన వాట్సాప్ సేవలకు మధ్యాహ్నాం 12.30గం.ల నుండి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ద్వారా రోజుకు 10 వేల కోట్ల చొప్పున మెసేజ్‌లు వెళ్తుంటాయి. వాట్సాప్ డౌన్ కావడంతో యూజర్లు ప్రస్తుతం టెలిగ్రామ్‌కు స్విచ్ అవుతున్నారు.