హీరోయిన్ పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని ఆమె మనువాడింది. దుబాయ్‌లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఫొటోలను షేర్ చేస్తూ తన భర్తకు చెందిన ఓ విషయాన్ని పంచుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు, పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘‘ప్రపంచంలో నేను అందమైన మహిళను కాకపోవచ్చు. ఓ మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలూ నాలో ఉండకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడూ నన్ను తక్కువగా చూడలేదు. ఎంతగానో ప్రేమిస్తూ.. నా వృత్తిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నన్ను మార్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’’ అని పూర్ణ పేర్కొన్నారు.
కోలీవుడ్‌కు చెందిన పూర్ణ.. తెలుగులో పలు చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుననారు. అవును, అవును 2, సీమటపాకాయ్, శ్రీ మహాలక్ష్మి చిత్రాల్లో హీరోయిన్గా, మరికొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని టీవీ షోల్లోనూ ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.