Home / BHAKTHI / లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలను కొలుస్తే సిరిసంపదలోస్తాయా..?

లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలను కొలుస్తే సిరిసంపదలోస్తాయా..?

లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలూ ఎనిమిది ఆర్థిక వికాస పాఠాలు! ఈ సూత్రాలను జీవితంలో భాగం చేసుకుంటే… సిరిసంపదలకు కొదవ ఉండదు.

ఆది లక్ష్మి

ఆది అంటే ఆరంభం. మనతొలి అడుగే జయాపజయాలను నిర్ణయిస్తుంది. బలమైన సంకల్పంతో వేసే తొలి అడుగు విజయానికి పునాది అవుతుంది. కాబట్టే, ఆదిలక్ష్మిని ‘లక్ష్య లక్ష్మి’ అనీ పిలుస్తారు.

ధనలక్ష్మి

సంపదల దేవత ధనలక్ష్మి. ఈ తల్లి చేతిలో కలశం ఉంటుంది. కలశం సంకల్పానికి ప్రతీక. యద్భావం తద్భవతి! మనసుంటే మార్గం ఉంటుంది. కోటి రూపాయల ఆస్తి అయినా ఒక రూపాయి పొదుపుతోనే మొదలవుతుంది.

ధైర్య లక్ష్మి

ధైర్యే సాహసే లక్ష్మి! విశ్వకుబేరులెవరూ యాదృచ్ఛికంగా సంపన్నులు కాలేదు. ధైర్యం చేశారు. సాహసానికి సిద్ధపడ్డారు. కొత్తదారిని నిర్మించుకున్నారు. విజయం అనేది మన ధైర్యానికి లభించే విలువైన ప్రతిఫలం.

విద్యాలక్ష్మి

సరస్వతీదేవి సాధారణ విద్యకు అధిదేవత. విద్యాలక్ష్మి ఆర్థిక విద్యకు అధినాయకురాలు. సంపన్నులు కావాలంటే ఆర్థిక విద్య తెలిసి ఉండాలి. పొదుపు-మదుపు సూత్రాల మీద పట్టు సాధించాలి.

సంతాన లక్ష్మి

సంతానమూ సంపదకు ప్రతీకే. పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. సంపదను పదిరెట్లు చేయడానికి కూడా అంతే ప్లానింగ్‌ అవసరం. దుందుడుకు నిర్ణయాలు నష్టాలనే మిగులుస్తాయి.

ధాన్య లక్ష్మి

ఈమెను ‘అన్న లక్ష్మి’ అనీ అంటారు. ధాన్యం శ్రమ ఫలితం. విత్తు నుంచి కోత వరకూ ఎంత కష్టపడతాడు రైతన్న! సంపాదనా శ్రమ ఫలితమే. దొడ్డిదారి సంపద శాశ్వతం కాదు. ఆ వైభోగం వచ్చినంత వేగంగానే వెళ్లిపోతుంది.

గజ లక్ష్మి

లక్ష్మీదేవి వాహనం ఏనుగు కూడా ఓ ఆర్థిక వికాస పాఠమే. గజరాజు కండ్లు చిన్నగా ఉంటాయి. కానీ తీక్షణత ఎక్కువ. షేర్లపై పెట్టుబడి, స్థిరాస్తి కొనుగోలు తదితర నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అంతే పదునైన దృష్టితో చూడాలి.

విజయ లక్ష్మి

గెలుపు శిఖర సమానం. అంతెత్తుకు చేరుకోవడం ఎంత కష్టమో, ఒక్క మెట్టు కూడా జారకుండా.. స్థిరంగా అక్కడ నిలబడటమూ అంతే ముఖ్యం. అందులోనూ సంపద చంచలమైంది. స్థితప్రజ్ఞతతోనే అది సాధ్యం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat