Home / MOVIES / నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ

నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ

విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది.

ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక అంతర్జాతీయ చిత్రంలో నటించనుంది. ఈ విషయాన్ని శ్రుతినే సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఇంటర్నేషనల్ మూవీ ‘ది ఐ’ (The Eye)లో శ్రుతి హాసన్ నటించనుంది.

‘ది లాస్ట్ కింగ్‌డమ్’ ఫేమ్ మార్క్ రౌలీ  ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘‘నేను గ్రీస్‌లో ఎందుకు ఉన్నానో మీకు తెలుసా. ఆసక్తికరమైన ప్రాజెక్టులో నేను భాగం అయ్యాను. ఈ శుభవార్తను మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని శ్రుతి హాసన్ చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat