దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య దీంతో 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,961 మంది కరోనా మహమ్మారి వైరస్ బారినపడి మరణించారు.
మరో 23,432 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉందని, మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల్లో 0.05 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 219.55 శాతం కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది.