కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు కోమటిరెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతతో కోమటిరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డు వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ పార్టీ అధిష్ఠానం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలంటూ చెప్పిన వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో తారిఖ్ అన్వర్పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డికి సూచించారు. మరి దీనిపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.