తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది.
తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంపైనే తన నమ్మకమంతా ఉంచుకుంది. ఈ మూవీలో అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ సందర్భంగా అనూ ఇమ్మాన్చుయేల్ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అనూ అసహనం వ్యక్తం చేసింది.
సదరు వ్యక్తి ‘‘మేడమ్ మీరు బన్నీతో ‘నా పేరు సూర్య’లో యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ల తమ్ముడి శిరీష్తోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్? ఎవరు నాటీ’’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో కోపానికి గురైన అను.. ‘‘మీకు అడగడానికి వేరే ప్రశ్నలు లేవా? దయచేసి.. కాస్త మంచి ప్రశ్నలు అడగండి’’ అంటూ ఘాటుగా స్పందించింది.