ప్రస్తుత బిజీబిజీ షెడ్యూల్ లో టైం తినకపోవడానికి.. టైంకి నిద్రపోవడానికి అసలు కుదరదు. అయితే చాలా మందికి మానసిక ఒత్తిడి,ఆందోళనకు ఇదోక కారణం అంటున్నారు. మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.
ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుందని వెల్లడించింది.పూర్తిగా పగటి పూట భోజనం చేసేవారితోపాటు పగలు, రాత్రి రెండు పూటలూ భోజనం చేసే అలవాటున్నవారిపై జరిపిన ఈ అధ్యయన వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి 26%, ఆందోళన 16% అధికంగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. కేవలం పగటి పూట మాత్రమే భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుదల ఇంత స్థాయిలో ఉండదని పేర్కొన్నది.