ఈ మధ్య స్టార్ హీరోల పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4K వెర్షన్‌లో మరోసారి విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌లో ఇప్పటికే ‘పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమా 4K వెర్షన్‌ను ఈ నెల 23న ఆయన పుట్టినరోజు స్పెషల్‌గా విడుదల చేస్తున్నారు.
విశేషం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. యూఎస్‌లోనూ ఈ సినిమాను రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. యూఎస్‌లో ఇప్పటి వరకు 70 పైగా లొకేషన్స్‌లో విడుదల ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా నెంబర్ పెరిగే అవకాశం ఉంది.ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాలన్నింటిని మించి ఈ ‘బిల్లా 4K’ అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ విషయం తెలిసి.. ఇది ప్రభాస్ రేంజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాకి టికెట్స్ కూడా అదే రేంజ్‌లో తెగుతున్నాయి.
ఇక ‘బిల్లా’ విషయానికి వస్తే.. దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అనుష్క, నమిత, హన్సిక హీరోయిన్లుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ రీ రిలీజ్‌లో వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు ఇవ్వబోతున్నట్లుగా కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ తెలిపారు. (Billa 4K US Release)