కోలీవుడ్ మన్మధుడు శింబు హీరోగా నటించిన ‘ఈశ్వరన్’ చిత్రం ద్వారా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఉత్తరాది భామ నిధి అగర్వాల్ .ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు, సోదరులు నాగ చైతన్య, అఖిల్‌తో వరుసగా ‘సవ్యసాచి’, ‘Mr.మజ్ను’ సినిమాలు చేసి టాలీవుడ్ లోనూ గుర్తింపు పొందింది.
అయితే.. అవి రెండు పరాజయం పాలవ్వడంతో ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత జయం రవి నటించిన ‘భూమి’ చిత్రంలో నటించినప్పటికీ ఆ మూవీ కూడా ఫెయిల్యూర్‌గా మిగలడంతో కోలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే.. ఈ తరుణంలోనే ఆమెకు టాలీవుడ్లో మాత్రం జాక్‌పాట్ తగిలింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది.ఈ నేపథ్యంలో తన సినీ జర్నీపై స్పందించిన నిధి మాట్లాడుతూ.. ‘చిత్రపరిశ్రమలో ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారంటే నేను నమ్మను.
కేవలం అందాన్ని మాత్రమే చూస్తున్నారు. అంగాంగ ప్రదర్శన చేస్తేనే సినీ అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం 20 శాతం మంది మాత్రమే ప్రతిభకు పట్టం కడుతున్నారు. నాలాంటి వారికి పెద్ద చిత్రాల్లో మంచి పాత్రలు లభించడానికి ప్రధాన కారణం పారితోషికం. మిగిలిన వారిలా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయను. ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాలు అన్నింటి విషయంలోనూ ఇదే జరిగింది’ అని స్పష్టం చేసింది.