పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి. సరిగ్గా 5 నెలలు అయ్యేసరికి పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టింది. ఇంతలో ఏమైందో ఏమో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. విశాఖ పట్నంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లా చదువుతోంది. అదే కాలేజ్‌లో చదువుతోన్న వినయ్‌కుమార్ అనే తన సీనియర్‌తో ప్రేమలో పడింది. అయితే వినయ్‌కు అప్పటికే పెళ్లయి విడాకులు కూడా తీసుకున్నాడు. జూన్‌లో వినయ్, శ్రావణి ఇంట్లో ఎవరికీ తెలీయకుండా పెళ్లి చేసుకున్నారు. శ్రావణి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది. వినయ్ కూడా ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు.
అంతా హ్యాపీ అనుకున్న వీరి లైఫ్‌లో ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి జరిగిన ఐదు నెలలకే గొడవలు పెట్టుకున్నారు. 3 రోజుల క్రితం శ్రావణి పోలీస్ స్టేషన్లో భర్త వినయ్‌పై కంప్లైంట్ ఇచ్చింది. ఇద్దర్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచిన పోలీసులు ఫస్ట్ ఫ్లోర్లో వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో శ్రావణి బయటకు వచ్చి తప్పు అంతా నాదే.. నేనే తప్పు చేశా అని పెద్దగా అరుస్తూ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకొని నిప్పు అంటించుకుంది. దీన్ని గమనించిన పోలీసులు ఫస్ట్‌ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే లోపు మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆమెను కాపాడే క్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ చేతులకు గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మృతిచెందింది.