తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే.
దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి.. అధికార టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే బీజేపీకి చెందిన దాసోజ్ శ్రావణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఓ లేఖ రాస్తూ తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు.
అయితే దాసోజ్ శ్రావణ్ ఈ రోజు శుక్రవారం సాయంత్రం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల పోలింగ్ రోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో దాసోజ్ శ్రావణ్ రాజీనామా ఆ పార్టీ పై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.